క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్
వచ్చేసింది. మార్చి 31వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు మ్యాచులు జరగనున్నాయి. ఈ
మేరకు షెడ్యూల్‌ను బీసీసీఐ.. శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. డిఫెండింగ్
ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో 2023 ఐపీఎల్
సందడి మొదలుకానుంది. ఇక కరోనా కారణంగా మూడేళ్ల పాటు సొంత రాష్ట్రాల అభిమానుల
మధ్య మ్యాచ్‌లు ఆడని జట్లు.. ఈసారి మాత్రం హోంగ్రౌండ్లో ఆడనున్నాయి. దీంతో
ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు.
ఇకపోతే చాలా రోజుల తర్వాత ఐపీఎల్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. ఈసారి ఉప్పల్
క్రికెట్ స్టేడియం మరోసారి ఫ్యాన్స్ కేరింతలతో మురిసిపోనుంది. సన్‌రైజర్స్
జట్టు ఏడు మ్యాచులు హైదరాబాద్‌లో మరో ఏడు మ్యాచ్‌లు బయట ఆడనుంది. గ్రూప్-బిలో
ఉన్న ఎస్ఆర్హహెచ్ తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 2న
ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోనే జరగనుంది.అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై
సూపర్ కింగ్స్ టీమ్ సీజన్‌కు శుభారంభం చేయనున్నాయి. తొలి సమరం జరిగే చోటే మే
28న ఆఖరి మ్యాచ్ జరగనుంది. 52 రోజుల పాటు జరగనున్న ఈ సీజన్లో మొత్తం 70
మ్యాచులు ఉంటాయి. వీక్ డేస్‌లో ఒక మ్యాచ్ ఉండగా ప్రతి శని, ఆదివారాల్లో రెండు
మ్యాచులు జరగనున్నాయి. ఈ సీజన్లో మొత్తం 18 డబుల్ హెడర్లు ఉండగా డే గేమ్‌లు
మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలుకానున్నాయి. ఈవెనింగ్ మ్యాచ్‌లు సాయంత్రం 07:30
గంటలకు ప్రారంభమవుతాయి.