విండీస్‌పై సునాయాస విజయం
టీ20 ప్రపంచకప్‌లో కొనసాగుతున్న భారత్ దూకుడు
టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిల జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో
పాకిస్థాన్‌పై గెలిచిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన కరేబియన్ అమ్మాయిలు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి
118 పరుగులు చేయగా.. షెఫాలీ వర్మ (28), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33),
రీచా ఘోష్ (44 నాటౌట్) రాణించడంతో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం
సాధించింది. 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచి ముందుగా
బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను భారత బౌలర్లు 118/6కే పరిమితం చేశారు. రెండో
ఓవర్లోనే కెప్టెన్ హేలీ మాథ్యూస్ (2) వికెట్ కోల్పోయిన కరేబియన్ జట్టును మరో
ఓపెనర్ స్టఫానీ టేలర్ (42), మూడో స్థానంలో బరిలోకి దిగిన షెమానీ
క్యాంప్బెల్లె (30) ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 73 పరుగులు
జోడించారు. ఇన్నింగ్స్ 13.3వ ఓవర్లో క్యాంప్బెల్లెను ఔట్ చేసిన దీప్తి శర్మ..
అదే ఓవర్లో టేలర్‌ను కూడా ఎల్బీగా పెవిలియన్ చేర్చింది. మరుసటి ఓవర్లో
చినెల్లీ హెన్రీని స్మృతి మంధన, రీచా రనౌట్ చేశారు. చెడన్ నేషన్ (18 బంతుల్లో
21 నాటౌట్), షబికా గజ్నబీ (13 బంతుల్లో 15) ఫర్వాలేదనిపించడంతో.. వెస్టిండీస్
20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ
3 వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత
బౌలర్‌గా దీప్తి రికార్డ్ క్రియేట్ చేసింది.