భారత్, ఆసీస్ మధ్య రేపటి నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. నాగ్
పూర్ లో తొలి టెస్టు జరగనుంది. అయితే మ్యాచ్ మొదలు కాకముందే నాగపూర్ పిచ్ పై
ఆస్ట్రేలియా మాజీలు, అక్కడి మీడియా పలు ఆరోపణలు చేశాయి. భారత్ తమకు అనుకూలంగా
పిచ్ ను మార్చుకుంటున్నదంటూ అక్కసు వెళ్లగక్కారు.అయితే బుధవారం మీడియాతో
మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఆరోపణలను కొట్టిపారేశాడు. పిచ్ పై
కాకుండా మ్యాచ్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. మ్యాచ్ ఆడే 22 మంది ఆటగాళ్లు
అద్భుతమైన ఆటగాళ్లే అని బదులిచ్చాడు. స్పిన్నర్లకు పిచ్ సహకరిస్తుందని..ఈ
పిచ్ పై స్ట్రైక్ రేట్ రొటేట్ చేస్తూ ఆడటం ఎంతో ముఖ్యమని అన్నాడు.