క్రికెట్‌కు టీమిండియా వెటరన్ క్రికెటర్ మురళీ విజయ్ గుడ్‌బై చెప్పేశాడు.
అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. మురళీ
విజయ్ 87 మ్యాచుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 4,490 పరుగులు చేశాడు.
టెస్టుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. 61 మ్యాచ్‌లు ఆడి 38.29 సగటుతో 3,982
పరుగులు చేశాడు. 17 వన్డేలు, 9 టీ20 మ్యాచుల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం
వహించాడు. ఇప్పుడు క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు
భావోద్వేగ ట్వీట్ చేశాడు. 2002 నుంచి 2018 వరకు సాగిన తన క్రికెట్ ప్రయాణంలో
భాగమైన అందరికీ ధన్యావాదాలు తెలిపాడు. ఈ ప్రయాణం గొప్పగా సాగిందని, భారత్‌కు
అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవమని అన్నాడు. తనకు
అవకాశాలు కల్పించిన బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (TNCA), చెన్నై
సూపర్ కింగ్స్, కెమ్‌ప్లాస్ట్ శాన్మర్ కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు
పేర్కొన్నాడు. మీ అందరితో కలిసి ఆడినందుకు గొప్పగా ఉందని, తన కలలు సాకారం
చేయడంలో సాయం చేసినందుకు జట్టు సహచరులు, కోచ్‌లు, మెంటార్లు, సపోర్ట్
సిబ్బందికి ధన్యవాదాలు తెలపుకుంటున్నట్టు పేర్కొన్నాడు. క్రికెట్లో తాను
ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు ఫ్యాన్స్ తనకు అండగా నిలబడి మద్దతు ఇచ్చారని,
వారు తనకు ప్రేరణ ఇచ్చారని అన్నాడు. తన కెరీర్లో తనకు అండగా నిలబడి ప్రేమ,
మద్దతు అందించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు చివరిగా ధన్యావాదాలు
చెప్పాలనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. వారు తనకు వెన్నెముకలా నిలిచారని, వారి
ప్రేమ, మద్దతు లేకుండా తాను ఏమీ సాధించలేకపోయి ఉండేవాడినని అన్నాడు.