ఐసిసి ట్రోఫీని గెలుచుకునే వరకు స్టార్ బ్యాట్స్ మెన్లు రోహిత్ శర్మ, విరాట్
కోహ్లీలతో ఓపికగా ఉండాలని అభిమానులకు ఓ యూట్యూబ్ చానెల్ ద్వారా భారత సీనియర్
స్పిన్నర్ ఆర్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. ప్రపంచ కప్ గెలవడానికి సచిన్
టెండూల్కర్ ఆరు ప్రయత్నాలను తీసుకున్నాడని అశ్విన్ గుర్తు చేశాడు.
చివరిసారిగా 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విజయం
సాధించిన తర్వాత ఐసీసీ టోర్నీల్లో విజయాన్ని దక్కించుకోలేకపోయామన్నాడు. “1983
ప్రపంచకప్ తర్వాత, గ్రేట్ సచిన్ టెండూల్కర్ 1992, 1996, 1999, 2003, 2007
ప్రపంచకప్‌లు ఆడాడు. చివరకు 2011లో ప్రపంచకప్ గెలిచాడు. చివరకు ఒక్క మెగా
టోర్నీ గెలవడానికి అతను ఆరు ప్రపంచకప్‌ల వరకు వేచి ఉండాల్సి వచ్చింది” అని
అశ్విన్ అన్నాడు. మరో దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని ఛార్జ్ తీసుకున్న వెంటనే
వచ్చి ప్రపంచ కప్ గెలిచాడు. అలాగని అన్ని సందర్భాల్లో అలా జరగదన్నాడు. గత
నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో ఘోర
పరాజయం పాలైన విషయాన్ని అశ్విన్ గుర్తు చేశాడు.