ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్ విజేతగా బెలారస్‌కు చెందిన అరినా
సబలెంక నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో ఐదో సీడ్ సబలెంక, కజకిస్తాన్‌కు
చెందిన రిబకినాపై విజయాన్ని సాధించింది. 4-6, 6-3, 6-4 తేడాతో రిబకినాపై ఆమె
విజయం సాధించింది. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో తొలిసారి ఫైనల్ చేరిన ఈ 24
ఏళ్ల అమ్మాయి.. తొలి సెట్ కోల్పోయినా తిరిగి పుంజుకుని టైటిల్‌ను ఖాతాలో
వేసుకుంది. తుదిపోరులో ఈ క్రీడాకారిణి 4-6, 6-3, 6-4 తేడాతో కజకిస్తాన్‌కు
చెందిన వింబుల్డన్ ఛాంపియన్ రిబకినాపై విజయం సాధించింది. ఈ ఏడాది ఆడిన 10
మ్యాచ్‌ల్లోనూ ఒక్క సెట్ కూడా కోల్పోకుండా గెలిచిన సబలెంక ఒకవైపు, టాప్‌సీడ్
స్వైటెక్‌తో సహా అగ్రశ్రేణి క్రీడాకారిణిలను ఓడించి తుదిపోరు చేరిన రిబకినా
మరోవైపు. ఈ టోర్నీలో ఇద్దరికీ ఇదే తొలి ఫైనల్. పోరు మొదలైంది. గంటకు 190
కిలోమీటర్లకు పైగా వేగంతో సర్వ్‌లు, ఒకరిని మించి మరొకరు.. ఏస్‌లు, కళ్లు
చెదిరే విన్నర్లతో సివంగుల్లా తలపడ్డారు. తొలి సెట్ రిబకినాదే. తొలి
గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం సబలెంకాకు నిరీక్షణ తప్పదేమోనన్న
అంచనాలు. కానీ బెలారస్ భామ వదల్లేదు. తర్వాతి రెండు సెట్లలో అద్భుతమైన
ఆటతీరుతో.. ఘనంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ బోణీ కొట్టింది.