ఈ ఏడాది జరగనున్న ఆసియా కప్, ఆపై జరిగే వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి భారత్,
పాకిస్థాన్ బోర్డుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈసారి ఆసియా కప్
పాకిస్థాన్ ఆతిథ్యంలో జరగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌కు భారత్
ఆతిథ్యమివ్వనుంది. ఇందులో వివాదం ఏంటంటే.. ఆసియా కప్ కోసం భారత జట్టు
పాకిస్థాన్ టూర్‌కు వెళ్లకపోవడమే. దీనిపై ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం
జరుగుతోంది. ఆసియాకప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్తాన్ వెళ్లబోదనే విషయాన్ని
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు జై షా గతేడాది స్పష్టం
చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, అప్పటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)
ఛైర్మన్‌గా ఉన్న రమీజ్ రాజా కూడా భారత జట్టు పాకిస్తాన్‌కు రాకపోతే,
పాకిస్తాన్ జట్టు కూడా ప్రపంచ కప్ ఆడేందుకు భారత్‌కు వెళ్లదని బెదిరించాడు. ఈ
క్రమంలో 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి
(బిసిసిఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు విరుద్ధమైన
ప్రకటనలు ఇచ్చారు. కాంటినెంటల్ ఈవెంట్ ఆతిథ్య హక్కులు గతంలో పాకిస్తాన్‌కు
ఇవ్వబడ్డాయి. 2023 ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం
లేదని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు కూడా అయిన బీసీసీఐ
కార్యదర్శి జే షా తెలిపారు. దానికి సమాధానంగా, 2023లో భారత్‌లో జరగనున్న వన్డే
ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ కూడా వైదొలగవచ్చని, వారి నిర్ణయం తీవ్ర
పరిణామాలను కలిగిస్తుందని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా బీసీసీఐని
హెచ్చరించారు.