ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓటమితో తన గ్రాండ్‌స్లామ్
ప్రయాణం ముగించిన సానియా మీర్జా కన్నీటి పర్యంతమయింది.భారతదేశంలోని అత్యుత్తమ క్రీడా ప్రముఖుల్లో ఒకరైన సానియా మీర్జా ఆస్ట్రేలియన్
ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోవడంతో శుక్రవారం తన గ్రాండ్‌స్లామ్
ప్రయాణానికి ముగింపు పలికింది. బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ మరియు రాఫెల్
మాటోస్ ఫైనల్లో భారత ద్వయం సానియా మరియు రోహన్ బోపన్నలను 7-6, 6-2 తేడాతో
ఓడించి, వారి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. గేమ్
ముగిసిన తర్వాత, సానియా బ్రెజిల్ జంటను అభినందించింది. అర్హత సాధించినందుకు
వారిని ప్రశంసించింది. కానీ, ఆమె తన ప్రయాణం గురించి మాట్లాడటం
ప్రారంభించినప్పుడు, ఏస్ టెన్నిస్ స్టార్ కన్నీళ్లను ఆపుకోవడానికి చాలా
కష్టపడింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023తో తన గ్రాండ్ స్లామ్ ప్రయాణాన్ని ముగించనున్నట్లు
సానియా ఇప్పటికే ప్రకటించింది. అయితే, 36 ఏళ్ల అథ్లెట్, తన అద్భుతమైన
కెరీర్‌కు తెర తీయడానికి ముందు మరికొన్ని ఈవెంట్లు ఆడాలని ప్లాన్ చేసింది.