భారత్ – న్యూజిలాండ్ ల మధ్య నేడు తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. వన్డేల్లో
ఇప్పటికే శ్రీలంక, న్యూజిలాండ్ లను క్లీన్ స్వీప్ చేసిన భారత్ జట్టు టీ 20
సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ ఫార్మాట్ లోనూ రాణించి భారత్
తన సత్తా చాటాలనుకుంటోంది. రాంచీలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం
కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాంచీ చేరుకుని ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారికి విశ్రాంతి ఇవ్వడంతో, ఆల్ రౌండర్
హార్దిక్ పాండ్యా మరోసారి కెప్టెన్ పాత్రను పోషించనున్నాడు. వైస్ కెప్టెన్ గా
సూర్యకుమార్ యాదవ్‌ని నియమించారు. ఈ నెల ప్రారంభంలో హార్దిక్ కెప్టెన్సీలో
జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20లో ఆతిథ్య శ్రీలంకను 2-1తో ఓడించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా పృథ్వీ షాకు జట్టులో స్థానం లభించడంతో రాంచీలో శుక్రవారం
జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరు చోటు
దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.