పురుషుల ఐపీఎల్ తరహాలోనే తమకంటూ ఒక లీగ్ ఉండాలంటూ కోరుకుంటూ వచ్చిన మహిళల
స్వప్నం భారీ స్థాయిలో సాకారం కానుంది. ఐపీఎల్ తరహాలో నిర్వహించే తొలి లీగ్
కోసం జట్లను సొంతం చేసుకునేందుకు బీసీసీఐ నిర్వహించిన వేలం అద్భుతం చేసింది.
మొత్తం రూ. 4666.99 కోట్లకు ఐదు టీమ్‌లను వేర్వేరు సంస్థలు సొంతం
చేసుకున్నాయి. లీగ్‌కు ‘హోం గ్రౌండ్’లుగా నిలిచే ఐదు నగరాలుగా అహ్మదాబాద్,
ముంబై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో ఖరారయ్యాయి. ఇందులో అహ్మదాబాద్ ఫ్రాంచైజీ
కోసం అదానీ సంస్థ అత్యధికంగా రూ. 1289 కోట్లు వెచ్చించింది. మూడు పురుషుల
ఐపీఎల్ టీమ్ యాజమాన్యాలు ముంబై, బెంగళూరు, ఢిల్లీ ఇక్కడా భారీ మొత్తాలను
మహిళల టీమ్‌లను సొంతం చేసుకోగా… ఐదో జట్టును క్యాప్రి గ్లోబల్ హోల్డింగ్స్
సంస్థ గెలుచుకుంది.
మహిళల లీగ్ జట్లను సొంతం చేసుకునేందుకు 17 సంస్థలు బిడ్లను కొనుగోలు
చేసి పోటీ పడ్డాయి. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్ ప్రకటించినప్పుడు జట్ల
కొనుగోలుకు సంబంధించి బీసీసీఐ కనీస విలువను నిర్ణయించింది. ఈసారి అలాంటిది
లేకుండా ఆసక్తి ఉన్నవారు తాము అనుకున్న మొత్తానికి బిడ్లు వేశారు. పురుషుల
లీగ్‌లో టీమ్‌ను దక్కించుకోవడంలో విఫలమైన అదానీ గ్రూప్ ఈసారి మహిళల
క్రికెట్లో అడుగు పెట్టగా, గుజరాత్ టైటాన్స్ స్పాన్సర్లలో ఒకటైన క్యాప్రి
గ్రూప్ కూడా టీమ్‌ను సొంతం చేసుకుంది. 2008లో తొలిసారి పురుషుల ఐపీఎల్లో
ఎనిమిది జట్లకు కలిపి రూ. 28,943.6 కోట్లు (అప్పటి డాలర్ విలువ ప్రకారం)
బోర్డు ఖాతాలో చేరాయి. ఇప్పుడు మారిన విలువ ప్రకారం చూసినా మహిళల లీగ్‌లో
వచ్చిన మొత్తం చాలా ఎక్కువని, నాటి రికార్డు బద్దలైందని బీసీసీఐ కార్యదర్శి జై
షా ప్రకటించారు.మహిళల ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ యజమానుల జాబితా:

1. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్. లిమిటెడ్: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రూ. 1289
కోట్లు
2. ఇండియన్ విన్ స్పోర్ట్స్ ప్రైవేట్. లిమిటెడ్: ముంబై ఫ్రాంచైజీ రూ. 912.99
కోట్లు
3. రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రై. లిమిటెడ్: బెంగళూరు రూ. 901 కోట్లు
4. జేఎస్ డబ్లూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్. లిమిటెడ్: ఢిల్లీ రూ. 810 కోట్లు
5. కాప్రి గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్. లిమిటెడ్: లక్నో ఫ్రాంచైజీ రూ. 757
కోట్లు