సానియా మీర్జా సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సానియా
జోడీకి వాకోవర్ లభించడం విశేషం. లాత్వియా, స్పెయిన్‌కు చెందిన జెలెనా
ఒస్టాపెంకో, డేవిడ్ వెగా జోడీతో క్వార్టర్ ఫైనల్లో తలపడాల్సి ఉంది. అయితే ఆ
జోడీ క్వార్టర్స్ నుంచి తప్పుకోవడంతో సానియా, బోపన్న సెమీస్ కు చేరారు.
కెరీర్లో చివరి గ్రాండ్‌స్లామ్ ఆడుతున్న సానియా మరో టైటిల్ దిశగా ఒక అడుగు
ముందుకేసింది. ఇప్పుడు క్వార్టర్స్ ఆడకుండానే సెమీస్ ఛాన్స్ దక్కడంతో మరో
టైటిల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో సానియా నిలిచింది.సానియా 36- రోహన్ 42
రోహన్ బొపన్న వయసు 42, తన వయసు 36 .అయినా టెన్నిస్ ఆడుతూ ఓ గ్రాండ్ స్లామ్
టోర్నీ ఫైనల్స్ చేరడం ఆశ్చర్యంగా, ఓ కలలా ఉందని విజయానంతరం సానియా చెప్పింది.
సెమీఫైనల్లో ప్రత్యర్థిజోడీతో విజయం కోసం గంటా 52 నిముషాలపాటు పోరాడటం ఎంతో
సంతృప్తినిచ్చిందని పొంగిపోయింది. తనవయసు 14 ఏళ్లు ఉన్న సమయంలో 20 సంవత్సరాల
రోహన్ తో కలసి తాను తొలిసారిగా మిక్సిడ్ డబుల్స్ పోరుకు దిగానని..ఇప్పుడు 36,
42 సంవత్సరాల వయసుతో ఆడటం అద్భుతమని చెప్పింది.
గత 18 సంవత్సరాలుగా తాను టెన్నిస్ కెరియర్ ను కొనసాగించి శారీరకంగా,
మానసికంగా అలసిపోయానని, వచ్చేనెలలో దుబాయ్ వేదికగా జరిగే టోర్నీతో ఆట నుంచి
వీడ్కోలు తీసుకొంటానని మరోసారి వివరించింది. 2009లో మహేశ్ భూపతితో జంటగా
ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ ట్రోఫీ అందుకొన్నానని, అదే తన కెరియర్
లో తొలిగ్రాండ్ స్లామ్ ట్రోఫీ అని గుర్తు చేసుకొంది.