ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్
శర్మ, శుభ్‌మన్ గిల్ శతకాలతో అదరగొట్టారు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ మీద
వీరిద్దరూ అనుభవం లేని కివీస్ బౌలర్లతో టీ20 తరహాలో ఆటాడుకున్నారు.
ఫెర్గ్యుసన్ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన
గిల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ
41 బంతుల్లో అర్ధ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ 26.1 ఓవర్లలో బంతుల్లోనే 212
పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. మొత్తమ్మీద చాలా నెలల తరువాత రోహిత్ సెంచరీ
బాదాడు. ఇక 50 ఓవర్లలో భారత్ 9 వికెట్లు నష్టపోయి 385 పరుగులు చేసి 386 భారీ
లక్యాన్ని కివీస్ ముందుంచింది.
రోహిత్ రికార్డులు
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ మూడో
స్థానానికి చేరుకున్నాడు. అఫ్రిదీ 369 ఇన్నింగ్స్‌ల్లో 351 సిక్స్‌లతో
అగ్రస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ 294 ఇన్నింగ్స్‌ల్లో
331 సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 234 ఇన్నింగ్స్‌ల్లో 271
సిక్సులు బాదాడు.
జస్ట్ ఒక్క పరుగు.. బాబర్ అరుదైన రికార్డ్‌ను బ్రేక్ చేసే ఛాన్స్ మిస్సయిన
గిల్..!
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 208 పరుగులు చేసిన గిల్.. రెండో వన్డేలో
40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 112 రన్స్ చేసిన భారత ఓపెనర్
మూడు వన్డేల సిరీస్‌లో 360 పరుగులు చేశాడు. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో
అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ రికార్డును
సమం చేశాడు. బాబర్ 2016లో వెస్టిండీస్‌పై వరుసగా మూడు సెంచరీలు చేసి 360
పరుగులు చేశాడు.
బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన భారత ఓపెనర్
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టే ప్రదర్శన
చేశాడు. తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్.. మూడో వన్డేలో శతకంతో సత్తా
చాటాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 360 పరుగులు చేసిన గిల్.. మూడు వన్డేల
సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్
రికార్డును సమం చేశాడు. హైదరాబాద్ వన్డేలో 208 పరుగులు చేసిన గిల్.. రాయ్‌పూర్
వన్డేలో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మూడో వన్డేలో 112 రన్స్ చేసిన మరో
పరుగు చేస్తే బాబర్ ఆజమ్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్న దశలో గిల్
ఔటయ్యాడు. 2016లో వెస్టిండీస్‌పై మూడు వన్డేల్లో వరుసగా శతకాలు బాదిన బాబర్
ఆజమ్.. 360 పరుగులు చేశాడు.