అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకున్నారు. సునీల్ శెట్టి తన కుమార్తె
అతియా శెట్టి – క్రికెటర్ కేఎల్ రాహుల్ వివాహం ఖండాలా ఫామ్ హౌస్ లో జరిగినట్లు
ధృవీకరించారు. ఖండాలా నుంచి కొన్ని ఫోటోలు విజువల్స్ సోషల్ మీడియాల్లోకి
వచ్చాయి. ప్రస్తుతం పెళ్లి మూడ్ లో హ్యాపీగా ఉన్న ఈ జంట వివాహ వేడుక నుంచి
అధికారిక ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అవి వైరల్ గా మారాయి. అతియా –
రాహుల్ సంయుక్తంగా షేర్ చేసిన ఫోటోల్లో కొత్త జంట ఆనందంతో మురిసిపోతూ
కనిపించారు. అభిమానులు – స్నేహితులు ఈ జంట పోస్ట్ కు అభినందన సందేశాలతో హుషారు
ప్రదర్శించారు. ఈ వివాహానంతరం సునీల్ శెట్టి తన కొడుకు అహన్ తో కలిసి బయటికి
వచ్చి మీడియా ఫోటోగ్రాఫర్లతో మాట్లాడారు. ఐపీఎల్ తర్వాత రిసెప్షన్ ఉంటుందని
సునీల్ శెట్టి ప్రకటించారు. సునీల్ – అహన్ ఫోటోగ్రాఫర్లకు స్వీట్లు పంచి
శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పెళ్లిలో భారీ నగలతో
అథియా ఫుల్ స్లీవ్ పింక్ బ్లౌజ్,లెహంగా ధరించింది. ఇక రాహుల్ క్రీమ్
షేర్వానీలో కనిపించాడు.