టీమిండియా క్రికెటర్ కే.ఎల్. రాహుల్, సునీల్ శెట్టి కుమార్తె, బాలీవుడ్ నటి
అతియా శెట్టి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఖాండాలోని సునీల్ శెట్టి ఫాంహౌస్లో
వీరి వివాహం జరిగింది. సాయంత్రం 4గంటల సమయంలో రాహుల్ అతియాకు మూడుముళ్లు
వేశారు. చాన్నాళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే. రాహుల్
విదేశీ టూర్లకు వెళ్లినప్పుడు అతియాకూడా రాహుల్ వెంటే కనిపించేది. అయితే,
కొద్దిరోజుల క్రితం వీరు వివాహం చేసుకుంటున్నట్లు ప్రకతించింది. సోమవారం ఈ
ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటయింది. నూతన వధూవరులకు బాలీవుడ్ నటులు అలియా భట్,
కరీనా కపూర్, అనుష్క శర్మ, కరిష్మా కపూర్, కరణ్ జోహార్, కార్తీక్ ఆర్యన్,
విక్కీ కౌశల్ వంటి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
ఇన్స్టాగ్రామ్లో అతియా శెట్టి, రాహుల్ సోమవారం సాయంత్రం తమ వివాహానికి
సంబంధించిన మొదటి చిత్రాలను పంచుకున్నారు. వాటికి మంచి క్యాప్షన్ కూడా
ఇచ్చారు. “మీ వెలుగులో, నేను ప్రేమించడం ఎలాగో నేర్చుకుంటాను… ఈరోజు, మా
అత్యంత ప్రియమైన వారితో, మాకు అపారమైన ఆనందం, ప్రశాంతతను అందించిన ఇంట్లో మేము
వివాహం చేసుకున్నాము. కృతజ్ఞత, ప్రేమతో నిండిన హృదయంతో, మేము కోరుకుంటున్నాము.
ఈ సమిష్టి ప్రయాణంలో మీ ఆశీస్సులు.” అంటూ పోస్ట్ చేశారు. దీనికి కరీనా కపూర్
ఇలా పోస్ట్ చేశారు. “అందమైన జంటకు చాలా అభినందనలు. జీవితకాలం నవ్వు మరియు
ప్రేమ.” కరిష్మా కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో, “అద్భుతమైన జంటకు అభినందనలు. నా
క్యూటీ అథియాకు శుభాకాంక్షలు” అని జోడించారు.