ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్విట్టర్ ఖాతా హ్యాక్
అయ్యింది. ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్ అకౌంట్ పేరును ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’
గా మార్చాడు. అలాగే డిస్ ప్లే ఫొటోనూ మార్చాడు. అంతేకాకుండా అకౌంట్ లో ఎన్ ఎఫ్
టీ సంబంధిత ట్వీట్లను పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్లను చూసే వినియోగదారులు ఆర్సీబీ
ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించారు. అయితే హ్యాకర్ ఆర్సీబీకి సంబంధించిన
ట్వీట్లను తీసివేయలేదు. అయితే దీనిపై ఆర్సీబీ అధికారికంగా స్పందించలేదు.
రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంచైజీ ఖాతా హ్యాకింగ్ కు గురవడం ఇదే తొలిసారి కాదు.
2021 సెప్టెంబర్ లో ఇలాగే ఆర్సీబీ ఖాతా హ్యాకయింది. అప్పుడు ఆ ఫ్రాంచైజీ తన
ఖాతాను కొన్ని గంటల్లోనే పునరుద్ధరించింది. మా ట్విట్టర్ ఖాతా కొన్ని గంటల
క్రితం హ్యాక్ అయ్యింది. అయితే మేం ఇప్పుడు తిరిగి యాక్సెస్ పొందగలిగాం.
హ్యాకర్లు పెట్టిన ట్వీట్లను మేం ఖండిస్తున్నాం. జరిగిన అసౌకర్యానికి
చింతిస్తున్నాం అని అప్పట్లో ఆర్సీబీ తెలిపింది.
“డియర్ 12వ మ్యాన్ ఆర్మీ, మా ట్విట్టర్ ఖాతా కొన్ని గంటల క్రితం రాజీ పడింది.
మేము ఇప్పుడు యాక్సెస్‌ని తిరిగి పొందగలిగాము. హ్యాకర్లు పెట్టిన ట్వీట్‌ను
మేము ఖండిస్తున్నాము. మేము ఇప్పుడు తొలగించిన ఆ ట్వీట్ నుంచి ఎలాంటి
కంటెంట్‌ను ఆమోదించము. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము’ అని RCB ట్వీట్
చేసింది.
ఐపీఎల్ 2023 వేలంలో ఆర్సీబీ కొనుగోలు చేసిన ఆటగాళ్లు: రీస్ టాప్లీ (INR 1.9
కోట్లు), హిమాన్షు శర్మ (20 లక్షలు), విల్ జాక్స్ (3.2 కోట్లు), మనోజ్ భాండాగే
(20 లక్షలు), రాజన్ కుమార్ (70 లక్షలు), అవినాష్ సింగ్ (60 లక్షలు), సోనూ
యాదవ్ (INR 20 లక్షలు).