కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో శనివారం తెల్లవారుజామున ముగిసిన రెండో
రౌండ్ సమావేశం తర్వాత వినేష్ ఫోగట్‌తో సహా అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్లు తమ
నిరసన విరమించుకున్నారు. తమ మనోవేదనలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ
లభించిన తర్వాత వారు తమ నిరసన విరమించారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
(డబ్ల్యూఎఫ్ఐ) కోచ్‌లు, ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక
దుష్ప్రవర్తన ఆరోపణలపై విచారణ జరిపిస్తామని ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్
పునియా, సాక్షి మాలిక్, ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత వినేష్ ఫోగట్‌లతో సహా
రెజ్లర్లకు మంత్రి హామీ ఇచ్చారు. ఆరోపణలపై విచారణకు పర్యవేక్షణ కమిటీని
ఏర్పాటు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. పర్యవేక్షణ కమిటీ విచారణ పూర్తయ్యే
వరకు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ తప్పుకుంటారని తెలిపారు. “పర్యవేక్షణ
కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. రేపు పేర్లు ప్రకటిస్తాం. నాలుగు
వారాల్లో కమిటీ విచారణ పూర్తి చేస్తుంది. మల్లయోధులు తమ డిమాండ్లను నా ముందుకు
తెచ్చారు. తగిన చర్యలు తీసుకుంటామని నేను వారికి హామీ ఇచ్చాను. లైంగిక
వేధింపులు, ఆర్థిక దుర్వినియోగం ఆరోపణలపై విచారణ జరుపుతాం’’ అని ఠాకూర్
శనివారం తెల్లవారుజామున విలేకరుల సమావేశంలో తెలిపారు.