భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు
వ్యతిరేకంగా రెజ్లర్ల బృందం తిరుగుబాటు చేసింది. గురువారం (జనవరి 19) జంతర్
మంతర్ వద్ద నిరసన చేపట్టింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై
ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత, ఒలింపియన్ వినేశ్ ఫోగట్ లైంగిక వేధింపుల
ఆరోపణలు చేశారు. లక్నోలోని నేషనల్ క్యాంప్ లో పలువురు కోచ్ లు మహిళా
రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫొగాట్ ఆరోపించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ
జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వినేశ్ ఫొగాట్‌తో పాటు బజరంగ్ పూనియా,
సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరంతా ప్రధాని
నరేంద్ర మోడీని కలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ
అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఖండించారు.