శ్రీలంక చిత్తు..
వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్
తిరువనంతపురం: వన్డే క్రికెట్ చరిత్రలో టీమిండియా చరిత్ర సృష్టించింది. అతి
పెద్ద విజయం నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో 317 తేడాతో
గెలిచి.. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా నిలిచింది. 391 రన్స్ తో
బరిలోకి దిగిన లంకను 73 రన్స్ కే ఆలౌట్ చేసింది. 2008లో ఐర్లాండ్ పై
న్యూజిలాండ్ 290 రన్స్ తేడాతో గెలిచింది. ఇప్పుడు దీన్ని ఇండియా
అధిగమించింది.
కాగా, ఆదివారం జరిగిన మూడో వన్డేలో భారత్ 390 పరుగులతో భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్(116), రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ (155)లు
సెంచరీలతో చెలరేగడంతో 390 రన్స్ చేసింది. కోహ్లీ ఈ మ్యాచ్‌లో వీరవిహారం
చేసి 166 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హాఫ్ సెంచరీ వరకు నిదానంగా ఆడిన
అతను ఆ తర్వాత గేర్ మార్చాడు. లంక బౌలర్లను ఉతికి ఆరేస్తూ సిక్సర్లతో
విరుచుకుపడ్డాడు. మునపటి కోహ్లీని గుర్తు చేస్తూ ఈ సిరీస్‌లో రెండో సెంచరీ
బాదాడు. అతని ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ
(42), శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 95 రన్స్ జోడించారు. కరుణరత్నే
బౌలింగ్‌లో రోహిత్ క్యాచ్ అవుట్ అయ్యాడు. మొత్తమ్మీద లంక ముందు భారీ స్కోర్
ఉంచింది. అయితే అటు బ్యాట్‌తో, ఇటు బంతితోనూ విజృంభించి శ్రీలంకను చిత్తుగా
భారత్ ఓడించింది.
తొలుత భారత్ నిర్దేశించిన 391 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక
చతికిలపడిపోయింది. భారత బౌలర్ల విజృంభించడంతో 22 ఓవర్లకు 73 పరుగులకే శ్రీలంక
కుప్పకూలింది. కీలకమైన నవనిదు ఫెర్నాండో (19), కుశాల్ మెండిస్ (4), ఆవిష్క
ఫెర్నాండో (1) చరిత అసలంక (1)లను సిరాజ్ అవుట్ చేయడంతో లంక
కోలుకోలేకపోయింది. ఆ తర్వాత షమీ, కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట
కొనసాగించారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఓవర్లో లంక కెప్టెన్ దసున్
షనక బౌల్డ్ అయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయింది. 22వ
ఓవర్ చివరి బంతికి కుమరను కుల్దీప్ బౌల్డ్ చేయడంతో 73 పరుగులకే లంక
ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లు, షమీ, కుల్దీప్
యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.