సునీల్ శెట్టి కూమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక
గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ అతియా శెట్టి. హీరో సినిమాతో వెండితెర
పైకి రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ఆమె
నటన మాత్రం ఆకట్టుకుంది. ఇండియన్ క్రికెటర్ కేఎల్. రాహుల్ తో అతియా కొంతకాలంగా
ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జంట త్వరలోనే ఏడడుగులు
వేయనున్నారని బాలీవుడ్ మీడియా తెలుపుతోంది.అతియా శెట్టి, కేఎల్. రాహుల్‌ల వివాహం జనవరి 23న జరగనుందని తెలుస్తోంది. ఈ
పెళ్లి మూడు రోజుల పాటు జరగనున్నట్టు సమాచారం. సునీల్ శెట్టి ఖండలా నివాసంలో ఈ
వేడుక జరగనుందట. పెళ్లి సంబరాలు జనవరి 21 నుంచి జనవరి 23 వరకు మూడు రోజుల పాటు
జరగనున్నాయని బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. బంధువులు, అత్యంత
సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికీ హాజరు కానున్నారట. పెళ్లి పనులు ఇప్పటికే
మొదలయ్యాయట. అతిథుల లిస్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేశారని తెలుస్తోంది. సల్మాన్
ఖాన్, అక్షయ్ కుమార్, జాకీ ష్రాఫ్, ఎమ్. ఎస్. ధోనీ, విరాట్ కోహ్లీ తదితరులు ఈ
పెళ్లిలో సందడి చేయనున్నారు.