టీమిండియా స్టార్ ప్లేయర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీలో చెలరేగాడు. అస్సాంపై ఈ
ముంబై ప్లేయర్ 379 రన్స్ విధ్వంసం సృష్టించాడు. కచ్చితంగా 400 పరుగులు
చేస్తాడనుకున్న దశలో ఔటయ్యాడు. షా కేవలం 383 బంతుల్లోనే.. 49 ఫోర్లు, 4 సిక్స్
లతో 379 పరుగులు చేశాడు. దీంతో ముంబై 598 పరుగులకు చేరింది.