శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. 374
పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు.. 50 ఓవర్లలో 8వికెట్ల
నష్టానికి 306 పరుగులు చేసింది. చివర్లో లంక కెప్టెన్ శనక సెంచరీతో చెలరేగాడు.
88 బంతుల్లో 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అతడి ఒంటరి పోరాటం వృథా
అయ్యింది. లంకకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల
నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (83), ఓపెనర్
శుభ్ మన్ గిల్(70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ
సెంచరీతో కదం తొక్కాడు. విరాట్ 87 బంతుల్లోనే 113 పరుగులు చేశాడు. వీరు ధాటిగా
ఆడటంతో టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీకి తోడు.. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్ మాన్
గిల్ చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీ
స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కోహ్లీ సెంచరీ హైలైట్. వన్ డౌన్ లో
వచ్చిన కోహ్లీ 87 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ తో 113 పరుగులు చేశాడు.
అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లీకిది 45వ సెంచరీ పూర్తి చేశాడు.