శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా 67 పరుగుల తేడాతో ఘన విజయం
సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల
భారీ స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక ఎనిమిది వికెట్లు
కోల్పోయి 306 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్
1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. లంక బ్యాటర్లలో కెప్టెన్ డాసున్ శనక (108;
88 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకంతో ఆకట్టుకున్నా లంకను
గెలిపించలేకపోయాడు.ఓపెనర్ నిశాంక (72; 80 బంతుల్లో 11 ఫోర్లు), ధనంజయ డి సిల్వా (47; 40
బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. అవిష్క ఫెర్నాండో (5), చరిత్ అసలంక (23), హసరంగ
(16), చమీక కరుణరత్నె (14) పరుగులు చేశారు. కుశాల్ మెండిస్, వెల్లలాగే
పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు
వికెట్లు పడగొట్టగా సిరాజ్ రెండు, హార్దిక్ పాండ్య, షమి, చాహల్ తలో వికెట్
తీశారు.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల
నష్టానికి 373 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113; 87 బంతుల్లో 12 ఫోర్లు,
1సిక్స్) శతకంతో అదరగొట్టాడు. వన్డేల్లో అతడికిది 45వ సెంచరీ కాగా..
శ్రీలంకపై తొమ్మిదోది. ఓపెనర్లు రోహిత్ శర్మ (83; 67 బంతుల్లో 9 ఫోర్లు, 3
సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (70; 60 బంతుల్లో 11 ఫోర్లు) రాణించగా.. శ్రేయస్
అయ్యర్ (28), కేఎల్ రాహుల్ (39), హార్దిక్ పాండ్య (14), అక్షర్ పటేల్ (9),
సిరాజ్ (7), షమి (4) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కసున్ రజితా మూడు, మదుశంక,
ధనంజయ, కరుణరత్నె, శానక తలో వికెట్ పడగొట్టారు.