కొత్త ఏడాదిలో మొదటి రోజు ఈ ఏడాది వన్డే వరల్డ్ సాధన దిశగా తొలి అడుగు
పడింది. ఈసారి స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవాలనే
లక్ష్యంతో జట్టు ఎంపిక మీద బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈరోజు ముంబైలోని
బీసీసీఐ కార్యాలయంలో జరిగిన భారత జట్టు సమీక్షా సమావేశంలో బీసీసీఐ 20
మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసింది. అయితే.. వాళ్ల పేర్లు మాత్రం
వెల్లడించలేదు. ఈ మెగా టోర్నమెంట్‌కు ముందు వీళ్లను రొటేషన్ పద్థతిలో
ఆడించనుంది. ఈ 20 మంది కాకుండా దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా ఆడిన
క్రికెటర్‌ను సెలక్టర్లు వరల్డ్ కప్ జట్టుకి ఎంపిక చేసే అవకాశం కూడా
ఉంది. 2011లో స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో ధోనీ సారథ్యంలోని
టీమిండియా విజేతగా నిలిచింది. దాంతో, ఈ ఏడాది కూడా ట్రోఫీ గెలవాలనే
పట్టుదలతో ఉంది. విదేశీ పర్యటనల్లో, ఐసీసీ మెగా టోర్నీల్లో భారత
ఆటగాళ్లు విఫలం కావడానికి ఐపీఎల్ ఒక కారణం అనేవాళ్లు చాలామందే. దాంతో 2023
ఐపీఎల్లో ఆడే క్రికెటర్ల మీద పని భారం పెరగకుండా చూడడం కూడా బీసీసీఐ
ఎజెండాలో ఉంది. అందుకని జాతీయ క్రికెట్ అకాడమీ, ఫ్రాంఛైజీలతో కలిసి
క్రికెటర్ల ఆరోగ్యపరిస్థితిని అంచనా వేయనుంది. పనిభార నిర్వహణకు సంబంధించి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)
ఘర్షణకు దిగింది. 2023 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లను లక్ష్యంగా
చేసుకున్నట్లుగా.