ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఫ్రాన్స్పై అర్జెంటీనా థ్రిల్లింగ్ విజయం
సాధించిన తర్వాత బాలీవుడ్ తారలు తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. ఉత్కంఠభరితమైన
3-3 డ్రా తర్వాత అర్జెంటీనా పెనాల్టీ షూటవుట్ లో 4-2తో ఫ్రాన్స్పై గెలిచి
ప్రపంచ కప్ ఛాంపియన్గా టైటిల్ను కైవసం చేసుకుంది. ఖతార్లో ఆదివారం లియోనెల్
మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది. విజయం సాధించిన
కొద్దిసేపటికే లియోనెల్ మెస్సీతో పాటు టీం సభ్యులపై ప్రశంసల వర్షం కురిసింది.
అర్జెంటీనాను విజేతగా ప్రకటించిన వెంటనే షారూఖ్ ఖాన్ తన ట్విట్టర్
హ్యాండిల్లో ఒక తీపి సందేశాన్ని రాశాడు. తన చిన్ననాటి రోజులను
గుర్తుచేసుకుంటూ.. మెస్సీ ‘ప్రతిభ, కృషి’ అమోఘమన్నాడు: “మేము అత్యుత్తమ
ప్రపంచ కప్ ఫైనల్స్లో అద్బుతమైన మ్యాచ్ ను చూశాం. మెస్సీకి శుభాకాంక్షలు”
అంటూ ట్వీట్ చేశాడు. రణవీర్ సింగ్ కూడా తన ట్విట్టర్ హ్యాండిల్లో ఇలా
రాశాడు… “నేను ఇప్పుడే మ్యాచ్
చూశాను?!?! చారిత్రాత్మకమైనది. ఐకానిక్.. ప్యూర్ మ్యాజిక్”. అంటూ ట్వీట్
చేశాడు.