హైదరాబాద్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి మొదలు
కానున్నాయి. ఆ రోజు ప్రథమ సంవత్సరం, ఆ మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు
ప్రారంభమవుతాయి. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆమోదంతో ఇంటర్‌బోర్డు
సోమవారం పరీక్షల కాలపట్టికను విడుదల చేసింది. ప్రయోగ పరీక్షలు ఫిబ్రవరి 15
నుంచి మార్చి 2 వరకు రోజూ రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ప్రథమ సంవత్సరం
విద్యార్థులకు మార్చి 4న నైతికత, మానవీయ విలువలు, 6న పర్యావరణ విద్య పరీక్షలు
నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. ప్రథమ ఏడాది
ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మార్చి 28వ తేదీకి,
రెండో ఏడాది విద్యార్థులకు మార్చి 29వ తేదీకి పూర్తవుతాయి. అన్ని పరీక్షలు
ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తాయి. ఈసారి 100 శాతం సిలబస్‌తోనే పరీక్షలు, ప్రయోగ
పరీక్షలు జరుగుతాయని గతంలోనే ఇంటర్‌బోర్డు ప్రకటించింది.జేఈఈ మెయిన్‌కు వారమే వ్యవధి : జేఈఈ మెయిన్ చివరి విడత పరీక్షలు ఏప్రిల్ 6
నుంచి 12 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ప్రధాన
పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగుస్తాయి. అంటే జేఈఈ మెయిన్‌కు సిద్ధం కావడానికి
వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండనుంది. గతంలో ఇంటర్ పరీక్షలు మార్చి 15-20
తేదీల మధ్య పూర్తయ్యేవి. ఈసారి 9-14 రోజులు ఆలస్యంగా పూర్తవుతుండటంతో
మెయిన్‌కు సిద్ధమయ్యేందుకు వ్యవధి తగ్గిపోయింది. ఇంటర్ ప్రధాన సబ్జెక్టుల
పరీక్షలు మార్చి 29వ తేదీతో ముగుస్తున్నందున పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ తొలి
వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పదో తరగతిలో ఆరు పేపర్లే
కావడంతో.. వారంలోనే పూర్తవుతాయి.