నల్లగొండ: నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద శుక్రవారం
తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఇనుపాముల వద్ద
అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి.
దీంతో అందులో ప్రయాణిస్తున్న తల్లీకొడుకులు అక్కడికక్కడే మరణించారు. మరో
ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి
చేరుకున్నారు. మంటలను అదుపుచేసి బాధితులను కారులోనుంచి బయటకు
తీశారు.క్షతగాత్రులకు నకిరేకల్‌లోని ప్రభుత్వ దవాఖానాలో ప్రథమ చికిత్స
అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్‌కు
తరలించారు. మృతిచెందిన వారిని తల్లి కరుణ, కుమారుడు ఫణికుమార్‌గా గుర్తించారు.
బాధితులంతా సూర్యాపేట వాసులని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట
వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు
చేస్తున్నారు.