పెద్దపల్లి : స్వయం ఉపాధిలో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా వారి
ఎదుగుదలకు రుణాలందజేస్తామని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల
ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మారం మండల కేంద్రంలో ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సేవ
సంస్థ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘దివ్యాంగుల
గర్వు సే’ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.18 సంవత్సరాలు నిండి 45 సంవత్సరాల లోపు
గల దివ్యాంగులను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణలో
గుర్తిస్తామన్నారు. వారికి గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా
శిక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం దివ్యాంగులకు ప్రభుత్వ సంస్థల ద్వారా ఆర్థిక
రుణాలంధజేస్తామన్నారు. అంతకుముందు సైడ్ డ్రైనేజీ నిర్మాణాన్ని పరిశీలించి
పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. అనంతరం
గొల్లపెల్లి మండలంలోని మల్లన్నపేట గ్రామంలో జరుగుతున్న శ్రీ మల్లికార్జున
స్వామి జాతర ఉత్సవాల్లో మంత్రి సతీ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు
సమృద్ధిగా పండి అన్నదాత ఇంట సిరుల పంట కురవాలని పూజలు చేసినట్లు తెలిపారు.
ప్రత్యేక పూజల తరువాత నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కు చెల్లించుకున్నారు.