చరిత్రలో ఇదే ప్రథమం
ఆదివారం, కార్తీకమాసంతో పోటెత్తిన భక్తులు
రూ.1,09,82,000 ఆదాయం
హైదరాబాద్ : తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదాద్రి ఆదివారం కావడంతో
యాదాద్రికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో యాదాద్రికి
రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. నేడు ఒక్కరోజే రూ.1,09,82,000 ఆదాయం
వచ్చింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో
ఆదాయం రావడం చరిత్రలో ఇదే ప్రథమం. కార్తీక మాసం, ఆదివారం నేపథ్యంలోనే ఈరోజు
యాదాద్రికి భక్తులు పోటెత్తారని అధికారులు పేర్కొన్నారు. యాదిగిరిగుట్టలో
గతంలో ఉన్న ఆలయాన్ని టీఆర్ఎస్ సర్కారు భారీ ఎత్తున అభివృద్ధి చేసిన సంగతి
తెలిసిందే. ఆలయ పునర్ నిర్మాణాన్ని అద్భుతమనదగ్గ రీతిలో చేపట్టింది. అందుకోసం
సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సాయాన్ని కూడా తీసుకుంది.