హైదరాబాద్: తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..
4న ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్ చేరుకుని రాజ్ భవన్లో బస చేయనున్నారు. 5న సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని.. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు, మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన రద్దయింది..