రేపు పదవీ విరమణ చేయనున్న ఈ. డి పి. కృష్ణమోహన్
ఇంజినీరింగ్ విభాగంలో ఉత్తమ సేవలందించారని ఎం.డి. కితాబు
సుధీర్ఘ కాలం ఆర్టీసీకి సేవలందించారని ప్రశంసలు
విజయవాడ : సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి. కృష్ణమోహన్ ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఎం. డి సిహెచ్. ద్వారకా తిరుమల రావు బుధవారం ఆర్టీసీ హౌస్ లో జరిగిన అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారుల సమీక్షా సమావేశంలో ఆయనను కుటుంబ సమేతంగా, ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందజేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి తన విధులు ఎంతో
నిబద్ధతతో నిర్వహించారని, కొత్త బస్సుల కొనుగోలు విషయంలోనూ, పాత బస్సులను కొత్త బస్సులుగా రీక్రియేషన్ ప్రక్రియలోనూ తనవంతు సూచనలు, సలహాలు ఇచ్చారని. కొనియాడారు. అంతేకాకుండా బస్సుల సీట్ల కొనుగోలు, బాడీ ఫ్యాబ్రికేషన్, సంబంధిత ఇంజనీరింగ్ వ్యవహారాలలో చురుకైన భాద్యతలతో వ్యవహరించేవారని తెలిపారు.
ఉద్యోగంలో చేరినప్పటి నుండి స్వయంకృషితో సంస్థ పట్ల అంకితభావంతో పనిచేసి, అనేక పదవులు చేపట్టి తన ఉద్యోగ భాద్యతలు క్రమశిక్షణతో నిర్వర్తించేవారని తెలిపారు. ప్రతి ఉద్యోగికీ పదవీ విరమణ తప్పదని, ఇది ఒకింత బాధాకరమైన విషయమైనా అంగీకరించక తప్పదని పేర్కొన్నారు. అదే విధంగా తదుపరి ఆయురారోగ్యాలతో చాలా సంతోషంగా గడపాలని అభిలషించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె. ఎస్. బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కోటేశ్వర రావు. ఎఫ్. ఏ రాఘవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి. కృష్ణమోహన్ ఉద్యోగ ప్రస్థానం : సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) పి. కృష్ణమోహన్, 1962 సంవత్సరంలో గుంటూరులో జన్మించారు. 1984 సంవత్సరంలో కాకినాడ జే ఎన్ టి యు నుండి బీ టెక్ పూర్తి చేశారు. 1988 డిసెంబర్ 15 న ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. లో అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ గా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్మూర్, మెదక్, నారాయణ ఖేడ్, రాజేంద్ర నగర్ లలో డిపో మేనేజర్ గా సేవలందించారు. అనంతరం నెల్లూరు లో వర్క్స్ మేనేజర్, హైదరాబాద్ లో డిప్యూటీ సి.ఎం.ఈ, డిప్యూటీ సి.టి.ఎం ఈ.డి. సెక్రటరీ, మెదక్ లో డిప్యూటీ సి. టి. ఎం., కర్నూలు రీజనల్ మేనేజర్ పదవులు చేపట్టారు. ఏ పదవిలో ఉన్నా సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేసి అధికారులు, తోటి ఉద్యోగుల ప్రశంసలు అందుకున్నారు.
గా రాష్ట్ర విభజన అనంతరం హెడ్ ఆఫీసులో సి ఎం ఈ గా విధులు నిర్వర్తించి అనంతరం పదోన్నతి పొంది విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇంజినీరింగ్) గా నియమింపబడి ఇప్పటివరకూ సేవలు అందిస్తూనే ఉన్నారు. ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. లో 36 సంవత్సరాలు సేవలు అందించారు. అదే విధంగా పదవీ విరమణ చేయబోతున్న కోనసీమ జిల్లా ప్రజా రవాణా
అధికారి ఆర్. వి. ఎస్. నాగేశ్వర రావు కి కూడా శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించారు. ఆర్టీసీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.