డక్కిలి : వెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్ ఫిబ్రవరి 27: విజయవాడలో జరిగిన వైకాపా ముఖ్యల రాజకీయ సదస్సుకు వైకాపా సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తో కలిసి డక్కిలి మండల నాయకులు జె ఎస్ సి కన్వీనర్ చింతల శ్రీనివాసులురెడ్డి, మండల ప్రెసిడెంట్ పెట్లూరు జగన్మోహన్ రెడ్డి హాజరు కావడం జరిగింది. రాబోయే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశయాలు అనుగుణంగా మండల క్యాడర్ సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇటీవల అసెంబ్లీ అభ్యర్థుల పుకార్లు నిజం కాదని సమన్వయకర్తలే పోటీలో ఉంటారన్న జగన్, ఇకపై ఎన్నికల రణరంగంలో ఇంకా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లడానికి నాయకులు క్యాడర్ సిద్ధంగా ఉన్నారు.