హైదరాబాద్ : జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, భారాస ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ఛైర్మన్ శోభన్‌రెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భారాసలో జరుగుతున్న అవమానాలు భరించలేక పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చిన ప్రతి నాయకుడికి సముచిత గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు. భారాసలో ఉద్యమ నాయకులకు సరైన న్యాయం జరగడం లేదని మోతె శ్రీలత దంపతులు ఆరోపించారు.