అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసిన మహేందర్ రెడ్డి
వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్న మహేందర్ రెడ్డి భార్య
ముఖ్యమంత్రిని కలవడంతో భేటీకి ప్రాధాన్యత
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. మహేందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మంత్రిగా ప్రమాణం చేశారు. సునీతా మహేందర్ రెడ్డి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా ఉన్నారు. వీరిద్దరు ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంను వారు కలిసిన సమయంలో మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు కూడా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నెలలో జరగగా అంతకు ముందు ఆగస్ట్ నెలలో మహేందర్ రెడ్డి కేబినెట్ మినిస్టర్‌గా ప్రమాణం చేశారు. ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.