పర్యావరణం, అడవుల ప్రాధాన్యతను అందరూ తెలసుకోవాలి : ఆర్.ఎం.డోబ్రియాల్
హైదరాబాద్ : ప్రతీ ఒక్కరూ అడవులు, పర్యావరణం ప్రాధాన్యత తెలుసుకోవాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. తెలంగాణ అటవీ శాఖ స్టాల్ ఇవాళ నాంపల్లి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రారంభమైంది. అడవుల ప్రాముఖ్యతను తెలుపుతూ, అటవీ శాఖ చేపట్టిన పనులను అందరికీ అర్థమయ్యే రీతిలో స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ను సందర్శించే పర్యాటకులు, పిల్లలు, పెద్దలు అడవుల ప్రాధాన్యతను తెలుసుకునే విధంగా డిస్ ప్లే అటవీశాఖ ఏర్పాటు చేసింది. హస్తకళలు, ఔషధ మొక్కల స్టాల్, ప్రత్యేకంగా పిల్లల కోసం మినీ జూ కూడా ఏర్పాటైంది. ఫారెస్ట్ యుటిలైజేషన్ ఆఫీసర్ డీ.వీ. రెడ్డి అటవీ శాఖ స్టాల్ ఏర్పాటును పర్యవేక్షించారు. కార్యక్రమంలో పీసీసీఎఫ్ (ఎస్ఎఫ్) సువర్ణ, చీఫ్ కన్జర్వేటర్ (ఆర్ అండ్ డీ), ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ సైదులు, డీఎఫ్ఓ ఎం.జోజి, ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.