వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి
మహనీయుల బాటలో నడుస్తున్న జగనన్న : ఎమ్మెల్యే డాక్టర్ సుధ
పేదింటి ఆడపడుచులకు దేవుడిచ్చిన అన్నయ్య సీఎం జగన్ : మాజీ ఎంపీ బుట్టారేణుక
బద్వేల్ : బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికారయాత్రను విశేషంగా హాజరయిన జనం విజయవంతం చేశారు. బహిరంగ సభ కూడా బాగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే డా.సుధ అధ్యక్షత వహించిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ ఎంపీ బుట్టారేణుక మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం పనిచేసేది సీఎం జగన్ ఒక్కడే : ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, బీసీల కోసం పని చేసే ముఖ్యమంత్రి దేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కడేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికర బస్సుయాత్రలో నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సీఎం జగన్ కోసం పనిచేసే కూలీ అని అన్నారు. టీడీపీ పెట్టినపుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఓడిపోవడంతో లక్ష్మీ పార్వతి కాళ్ళు పట్టుకొని టీడీపీలో చేరారు. దేశంలో ఎంఎల్ఏలను కొనే సంప్రదాయానికి తెరలేపిందే చంద్రబాబే. ఎన్టీఆర్‌ను సీఎం సీట్లో నుంచి దించి ఆయన మరణానికి బాబు కారణం అయ్యాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రక్తం టీడీపీ రక్తమే. రేవంత్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోసం ఆలోచిస్తాడు. బాబు తన కోవర్టులు సీఎం రమేష్‌ను బీజేపీకి, రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పంపాడు. పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పార్టీ పెట్టాడు. ఆయన కేవలం జగన్‌పై విమర్శల కోసమే పని చేస్తాడని నారాయణస్వామి విమర్శించారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో పరిపాలన : మాజీ ఎంపీ బుట్టారేణుక
ప్రతి ఒక్క సామాజికవర్గంలోని ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపి వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికార పదవులు ఇచ్చారని మాజీ ఎంపీ బుట్టారేణుక అన్నారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో పరిపాలన అందిస్తున్నారని, వలంటీర్ల ద్వారా సంక్షేమపథకాలు ఇంటి దగ్గరే అందేలా చేశారన్నారు. ఆరోగ్యశ్రీని ఎంతో బలోపేతం చేసిపేదల పాలిట దేవుడే అయ్యారని, మహిళల గురించి ప్రత్యేకంగా ఆలోచించే జగనన్న వారి కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. ఇళ్లపట్టాలు మహిళల పేరునే ఇస్తున్నారని, కరోనాలాంటి కష్టకాలంలో పాలించిన తీరు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదని, ధైర్యాన్ని నూరిపోయడమే కాకుండా ఆర్థిక సాయం కూడా అందించి కరోనా కాలంలో దేవుడే అయ్యారన్నారు. చంద్రబాబును నమ్మితే మనం కష్టాలు పడాల్సిందేనని, సంక్షేమపథకాలు అమలు కావాలన్నా,పేదల జీవితాలు బాగుపడాలన్నా జగనన్నే మళ్లీ రావాలన్నారు.
సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించారు : ఎమ్మెల్యే డాక్టర్ సుధ
అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని, గతంలో మహనీయులెందరో కలలు కన్నారు. ఆ దిశలో ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ సుధ అన్నారు. జగనన్న వారి కలలను అర్థం చేసుకున్నారని, సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించారు. అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో నడిచి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల నాయకులను అధికారపదవుల్లో కూర్చోబెట్టి వారి రాజకీయ,సామాజిక,ఆర్థిక స్థాయిని పెంచారన్నారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారని, అలాగే మంత్రివర్గంలో ఉన్న 25మందిలో 17మంది ఆయావర్గాల వారికే కేటాయించారన్నారు. వైద్యరంగంలో జగనన్న అద్భుతాలు చేశారు. ఏ పేదవాడికైనా జబ్బు చేస్తే భయపడాల్సిన అవసరం లేకుండా చేశారన్నారు.