మంత్రి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్ : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన
సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు
కార్యాలయంలో 52వ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో సీనియర్ కేటగిరిలో రాష్ట్రానికి
చెందిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారిణి ఈషా సింగ్ విభాగంలో మిక్స్ డ్ డబుల్
గోల్డ్ మెడల్ , టీం విభాగంలో మరో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించి
చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్ కు ఎంపిక సందర్భంగా మంత్రి అభినందించారు. తెలంగాణ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో
క్రీడా అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 17వేల
గ్రామపంచాయతీలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామని
వెల్లడించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యుత్తమ క్రీడా పాలసీని
తెలంగాణ రాష్ట్రంలో రూపొందిస్తున్నమన్నారు క్రీడాకారులను
ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈషా సింగ్ తన చిన్న నాటి నుండి అద్భుతమైన ప్రతిభ ను
కనబర్చి రాష్ట్రానికీ పేరు ప్రఖ్యాతులు తెస్తున్నారన్నారు. క్రీడారంగంలో
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సందర్భంగా తెలంగాణ క్రీడా శాఖ 2కోట్ల
రూపాయలు నగదును అందించి ప్రోత్సహించామన్నారు. అలాగే, గ్రూప్ వన్ స్థాయి
ఉద్యోగాన్ని, ఎంతో విలువైన ఇంటి స్థలాన్ని ఈషా సింగ్ కు క్రీడాకారుల కోటాలో
కేటాయించామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడా, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
వేస్తున్నామన్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు అద్భుత ప్రతిభను కనబరిచి
అంతర్జాతీయ స్థాయిలో పతకాలు తేవాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సచిన్ సింగ్, మహబూబ్ నగర్ కు చెందిన పలువురు
బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.