హైదరాబాద్ : ప్రభుత్వం వేలకోట్లతో బీసీల ఆత్మగౌరవం ప్రతిఫలించేలా
నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలు వేగం పుంజుకున్నాయి. నేడు ఉప్పల్ పీర్జాదిగూడలో
చాత్తాద శ్రీవైష్ణవులకు కేటాయించిన ఎకరం భూమి కోటి నిధులతో నిర్మించే
ఆత్మగౌరవభవనానికి మంత్రులు గంగుల కమలాకర్ చామకూర మల్లారెడ్డి చేతులమీదుగా
ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. పూర్ణకుంభంతో వేదమంత్రోచ్ఛారణల
మధ్య మంత్రులకు ఘన స్వాగతం పలికారు రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చాత్తాద శ్రీ
వైష్ణవులు, శంకుస్థాపన భూమి పూజ అనంతరం శిలా ఫలకాన్ని మంత్రులు
ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్పర్సన్
వకులాభరణం కృష్ణమోహన్‌రావు, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కుర్మాచలం,
చాత్తాద శ్రీవైష్ణవ సంఘం నేతలు, సభ్యులు పాల్గొన్నారు