ప్రాణం పోయే వరకు మాటపైనే ఉంటా
మెదక్ ప్రజలు నాకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారు
వారం రోజుల పాటు మల్కాజ్గిరి నియోజకవర్గంలో పర్యటిస్తా
వారం తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
బీఆర్ఎస్ పెద్ద నేత నాకు కాల్ చేశారు : మైనంపల్లి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సంచలన కామెంట్స్
చేశారు. పార్టీని తనేమీ అనలేదని, పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను
వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని
అన్నారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను కూడా ఇబ్బంది పెడతానని
ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా మైనంపల్లి శనివారం తన అనుచరులతో
సమావేశమయ్యారు. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి
బీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున
చేరుకున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల
నేపథ్యంలో ఆయన భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరిపారు. అనంతరం, మైనంపల్లి
సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టుగా
పేర్కొన్నారు.
మెదక్ ప్రజలు తనకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారని మల్కాజిగిరి ఎమ్మెల్యే
మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఆయన నివాసానికి
ఇవాళ పెద్దఎత్తున భారాస కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇటీవల తిరుమలలో
మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్
కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్‌కు
మెదక్ అసెంబ్లీ టికెట్‌ను నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో
మైనంపల్లి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
జీవితంలో స్థిరపడటం అంటూ ఉండదు. చనిపోయిన తర్వాతే జీవితంలో స్థిరపడినట్లు.
టీడీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్లు పనిచేశా. ఆ తర్వాత భారాసలో
ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా వెన్నుపోటు పొడిచే అలవాటు నాకు లేదు. ప్రాణం పోయే
వరకు మాటపైనే ఉంటా. మెదక్ ప్రజలు నాకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారు. నేనూ
ఎప్పుడూ కాంగ్రెస్, భారాస, బీజేపీని తిట్టలేదు. అంతా కలిస్తేనే తెలంగాణ
సాకారమైంది. భారాసను ఏమీ అనలేదు. పార్టీ కూడా నన్ను ఏమీ అనలేదు. మల్కాజిగిరిలో
వారం రోజులపాటు అనుచరులందరినీ కలుస్తాను. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత
నిర్ణయం తీసుకుంటాను. వారం తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్ కార్యాచరణ
ప్రకటిస్తా. నా కొడుకుకు 25 ఏళ్లు. ఇంకా భవిష్యత్ ఉంది. భారత్‌లో పోటీతత్వం
ఉంది. నా కొడుకు నా కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్‌లో
నా కుమారుడు తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడని మైనంపల్లి వెల్లడించారు.
నా జోలికి వస్తే ఊరుకోను :ఈ సందర్బంగా మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ పార్టీని
తనేమీ అనలేదని, పార్టీ కూడా తననేమీ అనలేదని చెప్పారు. తాను వెనక్కి తగ్గే
వ్యక్తిని కాదని అన్నారు. ప్రాణం పోయే వరకు ఉన్నదే మాట్లాడతానని అన్నారు. తనను
వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను కూడా ఇబ్బంది పెడతానని చెప్పారు. తనకు సత్తా
ఉందని, చర్యకు ప్రతిచర్య ఉంటుందని అన్నారు. మెదక్ నియోజకవర్గంలో ముఖ్య
నాయకులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తనను ఎవరూ ఏం అనకుంటే వారి జోలికి
వెళ్లనని చెప్పారు. తాను రేపటి నుంచి వారం రోజుల పాటు మల్కాజ్గిరి
నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. వారం తర్వాతనే మీడియాతో మాట్లాడతానని
తెలిపారు. బీఆర్ఎస్లో పెద్ద నాయకుడు తనకు ఫోన్ చేసినట్టు పేర్కొన్నారు.
తొందరపడొద్దని చెప్పారని, ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారని కూడా
తెలిపారు. మీడియాతో మాట్లాడొద్దని ఆ నాయకుడు ఒట్టు కూడా వేయించుకున్నారని
చెప్పారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇదిలా ఉండగా మంత్రి హరీష్
రావుపై మైనంపల్లి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది.
అయినా బీఆర్ఎస్ అధిష్టానం మైనంపల్లికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్
ఇచ్చింది. అదే సమయంలో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడికి
బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వాలనే మైనంపల్లి కోరికను మాత్రం తిరస్కరించింది.
దీంతో మైనంపల్లి తాజాగా ఈ కామెంట్స్ చేశారు.