హైదరాబాద్: తెలంగాణ మంత్రి హరీశ్‌రావుపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి
హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం
చేస్తున్నారని, అంతుచూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో
హరీశ్‌రావును అడ్రెస్ లేకుండా చేస్తానని మండిపడ్డారు. తన కుమారుడికి మెదక్
టికెట్ ఇస్తేనే తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని
దర్శించుకున్న అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా
హరీశ్‌రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారాస టికెట్ల గురించి
మాట్లాడుతూ ‘‘నా కుమారుడిని ఎమ్మెల్యే చేయడమే లక్ష్యం. మెదక్, మల్కాజ్గిరి
టికెట్లు ఇస్తేనే భారాస తరఫున పోటీ చేస్తాం. ఇద్దరికీ టికెట్ ఇవ్వకుంటే
స్వతంత్రులుగా పోటీ చేస్తాం. కొవిడ్ సమయంలో నా కుమారుడు ఎంతో ప్రజాసేవ
చేశాడు. దాదాపు రూ. 8కోట్లు సొంత డబ్బు ఖర్చు చేశాడని మైనంపల్లి తెలిపారు.