కావాల్నో కేసిఆర్ కు మాత్రమే తెలుసు
ఒక్కొక్కటిగా బాగు చేసుకుంటూ పోతూ..దేశం ముందట తెలంగాణను తలెత్తుకునెలా
చేసిండు కేసిఆర్
సంక్రాంతికి గంగిరెద్దుల వేషం వేసుకుని వచ్చినట్లు..ఎలక్షన్లు రాంగానే కొంత
మంది వచ్చి ఊర్ల మీద పడుతరు
రైతును అరిగోస పెట్టిన చేతి గుర్తోడు రైతు ధర్నా చేస్తున్నడు…ధరలు పెంచి
పేదల కడుపుకొడుతున్న పువ్వు గుర్తోడు పేదల కోసం ధర్నా చేస్తున్నడు
కాంగ్రెస్ పార్టీ రైతులకు 3గంటల కరెంట్ చాలు అంటున్నది…కేంద్రంలో ఉన్న
బీజేపీ పార్టీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతామంటున్నది
వీళ్ళు రైతులు,పేదల బాగు కోరుతారంటే మనం నమ్ముదామా..?
కాంగ్రెస్,బీజేపీ నేతల మాటలు నమ్మిమోసపోతే…మళ్ళీ గోస పడతాం..పాత రోజులే
పునరావృతం ఐతై
పసుపు బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులకు గుండు చూపెట్టిండు అర్వింద్
గెలిపిస్తే 5 రోజుల్లో తెస్తనన్న పసుపుబోర్డు 5 ఏండ్లు అయినా జాడ లేదు
అర్వింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను ఓడగొట్టుకున్నం
కేసిఆర్ కంటే ముందు 10 ఏళ్లు ఉండి ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుందంటున్న
రేవంత్ రెడ్డి ఓ లఫంగా… ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయని గుండు
అరవింద్ ఓ మోసకారి
కేసిఆర్ రాక ముందు యెట్లుండే…కేసిఆర్ వచ్చిన తర్వాత యెట్లైంది
కాపు రైతన్నలు దయచేసి ఆలోచన చేయాలి… గుండె మీద చేయి వేసుకొని ఆత్మ పరిశీలన
చేసుకోవాలి
కోనాపూర్ సభలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కమ్మర్పల్లి : బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలో ఆదివారం సుమారు 30
కోట్ల పలు అభివృద్ది పనులకు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్
రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ముందుగా కమ్మర్పల్లి మండలం అమీర్ నగర్ వద్ద
బిళ్యానాయక్ తండా నుండి కమ్మర్పల్లి అప్రోచ్ రోడ్ వరకు సింగిల్ లెన్ నుండి
డబుల్ లైన్ బిటి రోడ్ గా మార్చుటకు 4.50 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. ఈ
సందర్భంగా పలువురు మహిళలు మంగళ హారతులతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం
కమ్మర్పల్లి మండలం కొనాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
పాల్గొన్నారు. మంత్రికి కోనాపూర్ ప్రజలు అఖండ స్వాగతం పలికారు. దారిపొడవునా
చిన్నా,పెద్దా అంతా కలిసి మంత్రిపై పూలు జల్లుతూ తమ అభిమానాన్ని
చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులతో వచ్చి,బొట్టుపెట్టి శుభాశీస్సులు
అందించారు. అపూర్వ స్వాగతం పలికి కోనపూర్ గ్రామ ప్రజలు తనపై చూపిన ప్రేమకు
మంత్రి వేముల వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నర్సాపూర్ నుండి
భూషణ్ రావు పేట వయా ఇనాయత్ నగర్,కొనాపూర్ బిటి రోడ్(10/5 to 15/3)బిటి రోడ్
డబుల్ లైన్ గా మార్చుతూ 6.20 కోట్లతో శంకుస్థాపన,నర్సాపూర్ నుండి భూషణ్ రావు
పేట వయా ఇనాయత్ నగర్,కొనాపూర్ బిటి రోడ్(4/0 to 15/3) పునరుద్ధరణ 3.16 కోట్లతో
శంకుస్థాపన
కొనాపూర్ నుండి ఆత్మాకూర్ రోడ్ ను నూతన సింగిల్ లైన్ బిటి రోడ్ గా మార్చుతూ
2.50 కోట్లతో పనులు ప్రారంభం శంకుస్థాపన,
రాళ్ళవాగుపై (పెద్దవాగు) రెండు(2) చెక్ డ్యామ్ లు( చెక్ డ్యామ్ లు : 4.10
కోట్లు,3.97 కోట్లతో)నిర్మాణ పనులకు శంకుస్థాపన, 23 లక్షలతో రాళ్లవాగు అలుగు
స్పెషల్ రిపేర్స్ పనులకు శంకుస్థాపన , కొనాపూర్ నుండి కొత్త చేరు తండా వరకు
1.10 కోట్లతో బిటి రోడ్ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో
పాల్గొన్నారు.
రైతు నాయకుడు, స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ
కొనాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు నాయకులు స్వర్గీయ వేముల సురేందర్
రెడ్డి గారి విగ్రహాన్ని ఆయన కుమారుడైన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో
కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా ఆ ప్రాంత రైతాంగం కోసం స్వర్గీయ సురేందర్
రెడ్డి పడిన తపనను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలు కొనసాగిస్తానని,ఈ ప్రాంత
రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. జోహార్ సురేందర్ రెడ్డి సార్
అంటూ ప్రాంగణమంతా నినాదాలతో మారుమోగింది. అనంతరం కోనాపూర్ లో ఏర్పాటు చేసిన
బహిరంగసభలో మంత్రి వేముల ప్రసంగించారు.
బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ది పనుల పరంపర కొనసాగుతుందని అందులో భాగంగా
కమ్మర్ పల్లి మండలంలో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని,ముఖ్యంగా చిన్న
గ్రామమైన ఒక్క కోనాపూర్ లోనే కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది పనులకు
శంకుస్థాపనలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడి రైతుల కోరిక మేరకు
రాళ్ళవాగు మీద రెండు చెక్ డ్యాంలు,డబుల్ లేన్ రోడ్ల శంకుస్ధాపన చేసుకున్నామని
అన్నారు. ఇంత అభివృద్ది చేస్తున్న ఈ ప్రాంత గురడికాపు రైతన్నలు కొంత
అసంతృప్తిగా ఉన్నారని మండల పార్టీ అధ్యక్షుడు దేవేందర్ తనతో అన్నాడని కానీ
నియ్యత్ గా నా కాపు రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో
రాత్రి పూట చాలిచాలని కరెంట్ ఇస్తే తేళ్లు,పాములు కుట్టి,కరెంట్ షాక్ లు
కొట్టి గోసపడ్డ రోజులు గుర్తు చేసుకోవాలన్నారు. రైతు బాంధవుడు కేసిఆర్ రైతు
బాధలు తెలిసిన వ్యక్తిగా 24 గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారని నా కాపు
రైతన్నలు ఇప్పుడు తీరిక దొరికినప్పుడు దర్జాగా వెళ్లి కరెంట్ మోటార్ వేసుకొని
పొలం పారించుకుంటున్నరని తెలిపారు. తెలంగాణ అంతా ఒక్క కుటుంబమని,ఆ కుటుంబానికి
తండ్రిలాంటి వ్యక్తి కేసిఆర్ అని అన్నారు. ఎంత చేసినా కొంత మిగిలే ఉంటుంది.
అది రానున్న రోజుల్లో కచ్చితంగా చేస్తాడని అన్నారు. పైసలకు ఇబ్బంది ఉన్నా ఏక
కాలంలో 19వేల కోట్ల రైతు రుణ మాఫీ నిర్ణయం తీసుకొని మరోమారు రైతుపై తన ప్రేమను
చాటుకున్న వ్యక్తి కేసిఆర్ అని గుర్తు చేశారు. ఇంటికి ఏమి కావాల్నో ఇంటి
పెద్దకు మాత్రమే తెలుసని,తెలంగాణ ప్రజలకు ఏమీ కావాల్నో కేసిఆర్ కు మాత్రమే
తెలుసన్నారు. కేసిఆర్ కంటే బాగా తెలంగాణ ప్రజల బాగు కోసం ఎవరూ ఆలోచన చేయలేరని
మంత్రి స్పష్టం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఒక్కొక్కటిగా అన్ని
రంగాలను బాగు చేసుకుంటూ పోతూ దేశం ముందట తెలంగాణను తలెత్తుకునెలా చేసిండని
కొనియాడారు. అయినా కొంత మంది ఓట్ల రాజకీయం కోసం కేసిఆర్ ను విమర్శిస్తున్నారని
మండిపడ్డారు. సంక్రాంతికి గంగిరెద్దుల వేషం వేసుకుని వచ్చినట్లు..ఎలక్షన్లు
రాంగానే కొంత మంది వచ్చి ఊర్ల మీద పడుతరని అట్లాంటి వారి పట్ల జాగ్రత్తగా
ఉండాలని సూచించారు. “రైతును అరిగోస పెట్టిన చేతి గుర్తోడు రైతు ధర్నా
చేస్తున్నడు. ధరలు పెంచి పేదల కడుపుకొడుతున్న పువ్వు గుర్తోడు పేదల కోసం ధర్నా
చేస్తున్నడు” హత్య చేసినోడే సానుభూతి తెలిపినట్టు విచిత్రంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు 3గంటల కరెంట్ చాలు అంటున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ
పార్టీ రైతుల మోటార్లకు మీటర్లు పెడతామంటున్నది. వీళ్ళు రైతులు, పేదల బాగు
కోరుతారంటే మనం నమ్ముదామా అని రైతులను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ
పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమ పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ నేతల మాటలు
నమ్మిమోసపోతే మళ్ళీ గోస పడతాం..పాత రోజులే పునరావృతం అవుతాయన్నారు. పసుపు
బోర్డు పేరుతో బాండ్ పేపర్ రాసిచ్చి రైతులకు అర్వింద్ బోడగుండు చూపెట్టిండని
దుయ్యబట్టారు. గెలిపిస్తే 5 రోజుల్లో తెస్తనన్న పసుపుబోర్డు 5 ఏండ్లు అయినా
జాడ లేదన్నారు. అర్వింద్ మోసపు మాటలు నమ్మి బంగారం లాంటి కవితమ్మను
ఓడగొట్టుకున్నమని ఆవేదన వ్యక్తంచేశారు. కేసిఆర్ కంటే ముందు 10 ఏళ్లు ఉండి ఏమీ
చేయని కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుందంటున్న రేవంత్ రెడ్డి ఓ లఫంగా అని, ఇప్పుడు
కేంద్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయని గుండు అరవింద్ ఓ మోసకారి అని మంత్రి తీవ్ర
స్థాయిలో ధ్వజమెత్తారు. కేసిఆర్ రాక ముందు యెట్లుండే.కేసిఆర్ వచ్చిన తర్వాత
యెట్లైంది.కాపు రైతన్నలు దయచేసి ఆలోచన చేయాలి. గుండె మీద చేయి వేసుకొని ఆత్మ
పరిశీలన చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక
ప్రజాప్రతినిధులు,అధికారులు,బిఆర్ఎస్ శ్రేణులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు