హుస్నాబాద్ : తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల అభివృద్ధికి
పాటుపడుతున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్
కొనియాడారు. గత పాలనలో కరెంట్ ఉంటే వార్త. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే
వార్త అని వివరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు
మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. తెలంగాణలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదు,
కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని పురపాలక శాఖ మంత్రి
కేటీఆర్ ఉద్ఘాటించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పర్యటించిన కేటీఆర్..
మొత్తం రూ.27 కోట్ల 51 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్టీ మహిళా వసతి గృహం, టీటీసీ సెంటర్, బస్తీ
దవాఖానా, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి కేసీఆర్:అలాగే.. రూ.3 కోట్ల
50 లక్షలతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన
చేశారు. పట్టణంలో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
రూ.కోటితో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఈ సందర్భంగా
షటిల్ ఆడి సందడి చేశారు. ప్రారంభోత్సవాల అనంతరం.. స్థానిక బస్ డిపో గ్రౌండ్లో
ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్.. అనేక సంక్షేమ పథకాలతో
కేసీఆర్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. తాండాలను గ్రామ
పంచాయతీల మార్చి గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి
కేసీఆర్ అని కొనియాడారు.
‘కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు 6 గంటల కరెంట్ కూడా సరిగా లేదు. కాంగ్రెస్
పాలనలో కరెంట్ ఉంటే వార్త.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ పోతే వార్త.
బంజారాహిల్స్‌లో నీళ్లు వచ్చినట్లే గిరిజన తండాల్లోనూ నీళ్లు వస్తున్నాయి. మా
పరిపాలన ఎలా ఉందో హుస్నాబాద్ మహిళలు చెప్పారు. ఇంటింటికీ మంచి నీరు ఇచ్చిన
ఘనత మా ప్రభుత్వానిదే. సర్కారు దవాఖానాకే వెళ్తాం అనేలా ఆస్పత్రులను
తీర్చిదిద్దాం. గర్భిణులు, బాలింతలకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటే ఒప్పంద ఉద్యోగులకూ జీతాలు పెంచామని కేటీఆర్ అన్నారు.