టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారని పీసీసీ
అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరిన
శరత్మర్కట్ అనే యువకుడికి సీఎంవోలో రూ.లక్షన్నర వేతనంతో ప్రైవేట్
సెక్రటరీగా నియమించారని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా
ఉంచారని రేవంత్ విమర్శించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే
ప్రజాధనంతో పరాయి రాష్ట్రంలో పరపతి పెంచుకునేందుకు అక్కడి మనుషులను తెచ్చుకొని
ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ విస్తరణ కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
మహారాష్ట్ర నుంచి పార్టీలో చేరిన శరత్మర్కట్ అనే యువకుడికి సీఎంవోలో
రూ.లక్షన్నర వేతనంతో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారని రేవంత్ ఆరోపించారు.
ఇందుకు సంబంధించిన జీవోను రహస్యంగా ఉంచారని అన్నారు. ప్రజల సొమ్ముతో ఏడాదికి
రూ.18 లక్షల వేతనం ఇస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న
పోరాటానికి విద్యార్థి, నిరుద్యోగులు మద్ధతు పలకాలని ఆయన కోరారు. ఈ నెల 8వ
తేదీన సరూర్నగర్ స్టేడియంలో జరిగే యువ సంఘర్షణ సభకు అందరూ తరలిరావాలని
పిలుపునిచ్చారు.
“సాఫ్ట్వేర్ ఉద్యోగి శరద్ మర్కడ్ బీఆర్ఎస్లో చేరారని పత్రికల్లో వచ్చింది.
శరద్ మర్కడ్కు సీఎంవోలో ప్రైవేట్ సెక్రటరీగా నియమించారు. పార్టీలో చేరిన 20
రోజులకే రూ.లక్షన్నర వేతనంతో నియమించారు. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే
ఇలాంటి నియామకాలా? పక్క రాష్ట్రం వారిని తీసుకొచ్చి అడ్డగోలుగా ఉద్యోగం
ఇస్తారా? బీఆర్ఎస్ కార్యక్రమాల కోసం ప్రజాధనం వినియోగిస్తున్నారు. ఈ నెల 8న
జరిగే యూత్ డిక్లరేషన్ సభకు నిరుద్యోగులు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి అన్నారు.