ముఖ్యమంత్రి కేసీఆర్ సంప్రదించి నిర్ణయం
జిల్లా కేంద్రాలలో కార్యాలయ భవనాలు
మంత్రి జగదీష్ రెడ్డి
హైటెక్స్ శిల్పా కకావేదిక లో తెలంగాణా ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం
ప్లినరీ సమావేశాలు
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ : ఫోటో గ్రాఫర్లకు భీమా కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని రాష్ట్ర
విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి
కేసీఆర్ తో సంప్రదించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం
సాయంత్రం హైదరాబాద్ లోని హైటేక్స్ లోని శిల్ప కళావేదిక లో జరిగిన తెలంగాణా
ఫోటో&వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ప్లినరీ సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా
హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
ఫోటో గ్రాఫర్ల సంక్షేమ సంఘం కోరిన డిమాండ్లు సహేతుకమైనవే అయినప్పటికీ
నిబంధనలనుసరించి ప్రాధాన్యాతా క్రమంలో తీర్చే ప్రయత్నం చేస్తామన్నారు.
సంక్షేమ సంఘంకు జిల్లా కేంద్రలలో కార్యాలయాలు ఉండాలన్న విజ్ఞప్తి పై ఆయన
స్పందిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే ఇది అమలు పెడతామన్నారు.ఎలక్ట్రానిక్
రంగంలో వచ్చిన మార్పులు లాభం తో పాటు నష్టాన్ని కలిగిస్తున్నాయని ఆయన ఆందోళన
వ్యక్తం చేశారు. అందులో సెల్ ఫోన్ రూపంలో మొదలు నష్ట పోయింది ఫోటో గ్రాఫర్లే
నన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో సంఘం బాద్యులు యస్.వెంకట్ రెడ్డి,యస్ కే
హుస్సేన్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్,మునగాల శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.