లెక్చరర్ పాత్రను పోషించిన వినోద్ కుమార్
పలు అంశాలపై అభ్యర్థులకు ప్రశ్నలు వేసి జీ.కే. పరిజ్ఞానాన్ని పరీక్షించిన
వినోద్ కుమార్
కరీంనగర్ : యువతీ, యువకుల బంగారు భవిష్యత్తుకు పునాది వేసేందుకే ప్రతిమ
ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో రీడింగ్ సెంటర్ ను నిర్వహిస్తున్నట్లు
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలో నిరుద్యోగ యువతకు వివిధ పోటీ
పరీక్షల కోసం గత ఐదేళ్లుగా నిర్వహిస్తున్న రీడింగ్ సెంటర్ ను వినోద్ కుమార్
గురువారం సందర్శించారు. రీడింగ్ సెంటర్ లో యువత చదువును ఎలా కొనసాగిస్తున్నారో
వినోద్ కుమార్ స్వయంగా పలు ప్రశ్నలు వేసి అభ్యర్థుల నుంచి సమాధానాలు
రాబట్టారు. రీడింగ్ సెంటర్ లో అభ్యర్థుల జీ.కే. పరిజ్ఞానాన్ని పరీక్షించారు.
రీడింగ్ సెంటర్ లో వినోద్ కుమార్ లెక్చరర్ పాత్రను పోషించి అనేక ప్రశ్నలు
వేశారు.
ప్రతిమ ఫౌండేషన్ కల్పిస్తున్న రీడింగ్ సెంటర్ అవకాశాన్ని సద్వినియోగం
చేసుకోవాలని వినోద్ కుమార్ అభ్యర్థులకు సూచించారు. బాగా చదువుకొని
తల్లిదండ్రులకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరును తీసుకురావాలని వినోద్
కుమార్ అభ్యర్థులకు సూచించారు. రీడింగ్ సెంటర్ కు అవసరమైన మరిన్ని పుస్తకాలు,
స్టడీ మెటీరియల్స్ ను సమకూర్చనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. వేసవి
కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రీడింగ్ సెంటర్ లో అభ్యర్థులు అందరికీ ఉచితంగా
లస్సీని అందజేయనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్
యాదగిరి సునీల్ రావు కూడా పాల్గొన్నారు.