రైల్వేస్టేషన్లు, రైళ్లు ,పోర్టులను ప్రజా సొమ్ముతో అభివృద్ధి చేసిన తర్వాత,
వాటిని తిరిగి కార్పొరేట్ శక్తులకు అమ్మెందుకు మోడీ ప్రభుత్వం
ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు.
‘బిజెపి హటావో – దేశ్ బచావో ’ నినాదంతో ప్రజా క్షేత్రంలోనికి కేంద్ర ప్రభుత్వ
ప్రజా వ్యతిరేక, అప్రజస్వామిక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు.
సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 14 నుండి మే 15 వరకు నిర్వహించే “బిజెపి
హటావో – దేశ్ బచావో” పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సిపిఐ
రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు
ఈ.టి.నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్. ఛాయాదేవి, సహాయ కార్యదర్శులు
కమతం యాదగిరి, బి. స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం, సిపిఐ
జిల్లా కార్యవర్గ సభ్యులు జి. చంద్ర మోహన్ గౌడ్, పడాల నళిని, నిర్లేకంటి
శ్రీకాంత్, ఆర్. మల్లేష్ లతో కలిసి హైదరాబాద్, హిమాయత్ నగర్, మగ్ధుంభవన్ లో
నారాయణ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ లాభాలను
చూపించి, ప్రైవేటుపరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైలును
తీసుకొచ్చిందని విమర్శించారు. ఒక వైపు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసి,
మరోవైపు ప్రజా సొమ్ముతో వంద ఎయిర్ పోర్ట్ లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారని
మోడీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎయిర్ పోర్ట్ లను కూడా కార్పొరేట్లకు
అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.15 లక్షల కోట్ల ఆస్తలు
కలిగిన బి.ఎస్.ఎన్.ఎల్ సంస్థకు కేవలం రూ.35 కోట్ల అప్పును కూడ కేంద్రం
ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని పదవికి చదువుకు సంబంధం లేకపోయినా చదువుకున్న
డిగ్రీ అంశంలో కూడా మోడీ అబద్దాలు చెబుతూ అనైతికతకంగా వ్యవహారిస్తూ ప్రధాని
స్థాయిని దిగజార్చుకున్నారని మండిపడ్డారు. అదానీ బంగార చిలుక అని, కూపీలాగితే
మోడీ, అమిత్ షా లు బయటకు వస్తారని, అందుకే అదానీని ప్రధాని మోడీ రక్షించేందుకు
ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మోడీ మద్దతు లేకుండా అదానీ వ్యాపారమే
లేదన్నారు.
‘విశాఖ స్టీల్’ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావడం అభినందనీయం :
నారాయణ
విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగ సంస్థను తెలంగాణ ప్రభుత్వం తరపున కొనుగోలు
చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలిపారు. బొగ్గు, స్టీల్ లింకు
ఉన్నదన, సింగరేణి సంస్థ ద్వారా నడిపంచవచ్చని కెసిఆర్ ముందుకురావడాన్ని
ప్రత్యేకంగా అభినంధించారు