ప్రగతి భవన్‌కు మార్చ్ పిలుపునిద్దాం
బండి సంజయ్…రేవంత్‌రెడ్డికి షర్మిల ఫోన్
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డిలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఫోన్
చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ అంశంపై కలిసి పోరాడదామని ఈ సందర్భంగా ఆమె
కోరారు. ఇందుకోసం ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని, ప్రగతి భవన్‌కు మార్చ్
పిలుపునిద్దామని సూచించారు. ‘కేసీఅర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం
కావాలి. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను తెలంగాణలో బతకనివ్వరని షర్మిల
అన్నారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపి
త్వరలో సమావేశం అవుదామని చెప్పారు. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి
పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. దీనిపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ
ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందన్నారు. పార్టీలో చర్చించి
నిర్ణయం తీసుకుంటామని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల
వెల్లడించారు.