అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ‘అబ్కీ బార్
కిసాన్ సర్కార్’ నినాదంతో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా లోహాలో ఏర్పాటు
చేసిన భారాస బహిరంగ సభ లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ తరహా అభివృద్ధిని
ఫడణవీస్ చేస్తే.. మళ్లీ మహారాష్ట్ర రానని ప్రకటించారు. అలాంటి పథకాలు అమలు
చేయనంత వరకు వస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే
శంకర్రావు దోండే సహా పలువు మరాఠా నేతలను గులాబీ కండువా కప్పి కేసీఆర్
భారాసలోకి ఆహ్వానించారు.భారత రాష్ట్ర సమితి ( బిఆర్ఎస్ ) మహారాష్ట్రలో నిర్వహించిన రెండో బహిరంగ సభ
పెద్ద ఎత్తున విజయవంతమైంది. నాందేడ్ జిల్లా కాంధార్ లోహ లో ఆదివారం జరిగిన
బహిరంగ సభకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలి వచ్చారు. వేలాదిగా తరలివచ్చిన
ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సభా స్థలి జనసంద్రాన్ని తలపించింది.
బహిరంగ సభ నేపథ్యంలో కంధార్, లోహ పట్టణాలు గులాబీమయమయ్యాయి. గులాబీ తోరణాలు,
ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రధాన రహదారుల వెంట సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను.. అక్కడి వారి మరాఠా భాషలో
వీడియో డాక్యుమెంటరీల రూపంలో చూసి, సభకు హాజరైన ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు.
సిఎం కేసీఆర్ కు మరాఠా ప్రజల నీరాజనం : దేశ ప్రధాని కావాలని నినాదాలు
బిఆర్ఎస్ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాంధార్ లోహ ప్రాంత ప్రజలు
నీరాజనాలు పలికారు. హెలిప్యాడ్ నుండి సభా ప్రాంగణానికి వెలుతున్న సిఎం
కాన్వాయ్ కి మూడు కిలోమీటర్లు ప్రజలు భారీ సంఖ్యలో దారి పొడవునా నిలబడి
అభివాదం చేస్తూ కేరింతలు కొట్టారు. సీఎం కేసీఆర్ ఉన్న బస్ , కాన్వాయ్ పై దారి
పొడవునా గులాబీ రంగు పేపర్లు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ సెల్
ఫోన్లలో కేసీఆర్ గారిని వీడియో తీసుకోవడానికి పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు బస్ లో నుండి ప్రజలకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అభివాదం
చేస్తూ వెళ్ళారు.
‘‘దేశ్ కీ నేతా కైసే హోగా … సిఎం కేసీఆర్ జైసే హోగా’’…అంటూ ఈ దేశానికి
సిఎం కేసీఆర్ ప్రధాని కావాలని ముక్త కంఠంతో మరాఠా ప్రజలు నినదించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల గురించి మాట్లాడినప్పుడు ప్రజల నుండి విశేష స్పందన
లభించింది. జై బిఆర్ఎస్ – జై కిసాన్ నినాదాలతో సభా స్థలి ప్రతిధ్వనించింది.
రైతన్నలు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో హోరెత్తిస్తూ బిఆర్ఎస్ తోనే
‘రైతు రాజ్యం’ సాధ్యమంటూ ముక్తకంఠంతో నినదించారు. కేసీఆర్ సారథ్యంలోని
బిఆర్ఎస్ పార్టీ దేశపాలన పగ్గాలను చేపట్టాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు.
తెలంగాణ ప్రజలకు అందుతున్నట్టే తమకూ ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా,
సాగునీరు, తాగునీరు రావాలంటే..తమకూ బిఆర్ఎస్ ప్రభుత్వం కావాల్సిందేననే భావన
అక్కడి ప్రజల్లో ఈ సందర్భంగా వ్యక్తమైంది.