సిద్ధమైంది. లోహాలో జరిగే ఈ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి లోహాకు కేసీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో భారీ జన సమీకరణకు బీఆర్ఎస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.మహారాష్ట్రలోని లోహా నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నేడు భారీ బహిరంగ సభ
నిర్వహించనుంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మహారాష్ట్రలో నేడు రెండోసారి సభ
నిర్వహిస్తోంది. ప్రవాస తెలంగాణ వాసులు అధికంగా ఉన్న నాందేడ్‌లో ఏర్పాటు చేసిన
ఈ సభకు.. జనం అధిక సంఖ్యలో హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశాయి.
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్న ఈ సభతో మహారాష్ట్రలో
పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది.
బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన
ముఖ్యమంత్రి కేసీఆర్.. వివిధ రాష్ట్రాల్లోని పార్టీల నేతలతో సంప్రదింపులు
జరిపారు. దాంట్లో భాగంగానే మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర
పార్టీల నాయకులతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు సైతం ముందుకొచ్చారు.
తెలంగాణను ఆనుకొని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల
అమలును కోరుతున్నారు. వాటన్నింటిని పరిగణనలోనికి తీసుకొని సీఎం కేసీఆర్ మొదట
మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణకు నిర్ణయించారు.
సీఎం కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి
హెలికాప్టర్లో బయల్దేరి మహారాష్ట్రలోని లోహాకు చేరుకుంటారు. 3 గంటలకు స్థానిక
నేతలతో సమావేశమై అనంతరం 4 గంటలకు బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈ సభలో
పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్
సమక్షంలో బీఆర్ఎస్లో చేరతారు. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండు దఫాలుగా
విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాజాగా కేంద్రం కాంగ్రెస్
అగ్రనేత రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంపైనా
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్
ప్రసంగం ఎలా ఉంటుందనే దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌పై
బీఆర్ఎస్ వైఖరిని కూడా వెల్లడించే అవకాశం ఉంది.