హైదరాబాద్: భాష సాంస్కృతిక శాఖ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో
రవీంద్రభారతిలో శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలను కనుల పండువగా
నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పశు
సంవర్డక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి,
శాసన మండలి చీఫ్ విప్ భాను ప్రసాద్, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే
రసమయి బాలకిషన్, ప్రభుత్వ సలహా దారు రమణాచారి, టీఎస్ఐడిసీ ఛైర్మన్ వేణుగోపాల
చారి, డీజీపీ అంజనీ కుమార్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, ఎమ్మెల్యేలు
దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, తదితరులు
పాల్గొన్నారు.