హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భవించిన తొమ్మిదేశ్లలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా
గుర్తింపు పొందిందని, చారిత్రక కట్టడాలు, నిర్మాణాలతో పాటు అద్భుత నిర్మాణాలతో
అందరి దృష్టిని తమ రాష్ట్రం ఆకర్షిస్తోందని, యునెస్కో తదితర సంస్థల విశిష్ట
పురస్కారాలను పొందుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి
వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ
పర్యాటక, సాంస్కృతిక ప్రదర్శనలో తెలంగాణ పర్యాటక స్టాల్‌ను ఆయన
ప్రారంభించారు. వేములవాడ శాసనసభ్యుడు రమేశ్, భారత రాయబారి పర్వతనేని
హరీశ్‌రావు, భారత పర్యాటక కార్యదర్శి అర్వింద్‌సింగ్, తెలంగాణ పర్యాటక సంస్థ
ఎండీ మనోహర్, జర్మనీలోని తెలంగాణ సంఘం అధ్యక్షుడు రఘు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అద్భుత ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా ఉంది.
అభివృద్ధిలో ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. పర్యాటకరంగంలోనూ చరిత్ర
సృష్టించింది. రామప్ప కేంద్రం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు
పొందింది. బుద్ధవనం ప్రాజెక్టును గొప్పగా తీర్చిదిద్దాం. అత్యధిక విదేశీ
పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. పెట్టుబడులకు
అన్ని విధాలా అనుకూలంగా ఉందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ
స్టాల్లో రామప్ప దేవాలయం, కాకతీయుల కళాతోరణం, బుద్ధవనం నమూనాలను
ప్రదర్శించారు. జర్మనీ తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను
నిర్వహించారు. 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంస్కృతిక సంస్థలు ఈ ప్రదర్శనలో
పాల్గొంటున్నాయి. పలు దేశాల ప్రతినిధులు తెలంగాణ స్టాల్‌ను సందర్శించి,
మంత్రితో భేటీ అయి పర్యాటక ప్రాజెక్టులపై చర్చించారు.